![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -319 లో.... గంగ ప్రాక్టీస్ కి వెళ్లకుండా టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తుంది. రంగా కూడా ఉంటాడు. అప్పుడే రుద్ర వచ్చి ఒక ఇడ్లీ ఏం సరిపోతుందా బొండం కూడా తింటావా అని వెటకారంగా మాట్లాడతాడు. రుద్ర రావడంతో గంగ భయపడుతుంది. మీకు ఇప్పటికే ప్రాక్టీస్ లేట్ అయింది. అక్కడ ఉంది మావయ్య.. ఏం అంటాడో ఏమో అని రుద్ర అనగానే గంగ టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత గంగ, రంగ, రుద్ర ముగ్గురు కలిసి విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని ఎప్పుడు రమ్మని చెప్పాను..ఎప్పుడు వచ్చారని విశ్వ కోప్పడతాడు. పనిష్ మెంట్ తప్పదని విశ్వ అనగానే ఏం పనిష్ మెంట్ అని గంగ అంటుంది. యాభై గుంజీలు తియ్యాలని విశ్వ అనగానే నా చెల్లి తీయదని రంగా అంటాడు.నీకు కూడా భాగం ఉంది కాబట్టి నువ్వు యాభై పుషప్స్ చేయాలని విశ్వ అంటాడు. ఆ తర్వాత గంగ, రంగా ఇద్దరు పనిష్ మెంట్ ని చేస్తుంటారు. ఇక విశ్వ దగ్గరికి రుద్ర వస్తాడు. మీ ఆవిడ పనిష్ మెంట్ బాగా చేస్తుందా అని విశ్వ అనగానే చేస్తుందని రుద్ర అంటాడు. ఆ తర్వాత జయ ఇప్పటికే లేచి వాకింగ్ కి పోయి ఉంటుంది ఎందుకంటే మావయ్య డిసిప్లేన్ గా ఉంటాడని విశ్వ తో రుద్ర అంటాడు. అప్పుడే లక్ష్మి వచ్చి జయ అమ్మ ఇంకా నిద్ర లేవలేదు.. తనకి బెడ్ కాఫీ ఇవ్వమంటారా అని చెప్తుంది. ఏంటి మావయ్య అలా ఉంటే మిమ్మల్ని అంటారు కదా మీ పెంపకం గురించి అంటారని రుద్ర అనగానే ఖచ్చితంగా అలాగే అంటారని విశ్వ అంటాడు. ఆ తర్వాత జయ దగ్గరికి రుద్ర వెళ్లి తన మొహంపై వాటర్ కొట్టి లేపుతాడు.
జయ కోప్పడుతుంది. మావయ్య ని పిలవమంటావా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు రుద్ర. దాంతో జయ త్వరగా లేచి వస్తుంది. మరొకవైపు కార్తీక్ కావాలనే ప్రమీలకి కన్పించేలా తన ఇంటి ముందు ఏదో పని ఉన్నట్లు ఆగుతాడు. ప్రమీల అతని దగ్గరికి వస్తుంది. ఏంటి ఇక్కడ అని అడుగుతుంది. మా ఫ్రెండ్ టిఫిన్ చేద్దాం రమ్మంటే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే లేడని కార్తీక్ అనగానే సరే మా ఇంటికి వచ్చి టిఫిన్ చెయ్యండి అని ప్రమీల అంటుంది. కార్తీక్ ఇంట్లోకి వెళ్లి టిఫిన్ చేస్తాడు. ప్రమీల వడ్డీస్తుంది. మరొక వైపు పెద్దసారు, శకుంతల, రాఘవ బయటికి వెళ్లి తిరిగి వస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |